Mahesh Babu, Trivikram: మహేష్ మూవీ సంక్రాంతికే ఫిక్స్.. ఇంతకు మించి సాక్ష్యం అవసరమా?

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కావడం ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు తాజాగా సంక్రాంతికి గుంటూరు కారం మూవీ రిలీజ్ పక్కా అని చెప్పుకొచ్చారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఇంటర్వెల్ సీన్ ఆరు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 3 రోజుల్లో ఈ సీన్ షూట్ పూర్తైందని సమాచారం. ఇదే వేగంతో సినిమా తీస్తే గుంటూరు కారం మూవీ అనుకున్న తేదీకి రిలీజ్ కావడం ఖాయమని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ స్పీడ్ మామూలుగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ మూవీ సంక్రాంతికే ఫిక్స్ అని ఇంతకు మించి సాక్ష్యం అవసరమా? అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాలోని కొన్ని సీన్లు మామూలుగా ఉండవని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఎక్కువగానే ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాపై ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది.

మహేష్ మూవీలో శ్రీలీల ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహేష్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఇతర భాషల్లో కూడా మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా మహేష్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి రాజమౌళి సినిమాకు సంబంధించిన వర్కౌట్లను మొదలుపెట్టనున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత కూడా మరిన్ని భారీ ప్రాజెక్ట్ లలో నటించనున్నారని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కనుండగా ఈ సినిమా ఆ రేంజ్ సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus