Mahesh Babu, Trivikram: మహేష్ త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే?

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించగా త్రివిక్రమ్ మహేష్ సినిమా పనులతో బిజీ అవుతున్నారు. సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేస్తారని బోగట్టా. ఈ సాంగ్ కు ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన జానీ మాస్టర్ పని చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. సాంగ్ షూటింగ్ పూర్తైన తర్వాత మేకర్స్ ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఈ సినిమాకు ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నారు. మహేష్ పూజా హెగ్డే కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో వరుసగా విజయాలను అందుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. ఖర్చు విషయంలో రాజీ పడకుండా నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి గట్టి పోటీ ఉండటంతో మేకర్స్ ఈ సినిమాకు మరో డేట్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది.

పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని హిందీలో కూడా ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. ఈ సినిమాతో పాటు మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus