Mahesh Babu, Trivikram: ఎన్టీఆర్ తో పాటు త్రివిక్రమ్ కు కూడా మహేష్ హ్యాండ్ ఇచ్చినట్టేనా..!

దాదాపు పదేళ్ల తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందనుందని అధికారిక ప్రకటన వచ్చింది. మహేష్ పుట్టినరోజు నాడు క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ను కూడా ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్ అని తమన్ సంగీత దర్శకుడని చిత్ర బృందం తెలిపింది.పరశురామ్(బుజ్జి) తో చేస్తున్న ‘స‌ర్కారు వారి పాట’ చిత్రం తర్వాత త్రివిక్ర‌మ్ తో మహేష్ సినిమా చేయాల్సింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు గురించి ఎటువంటి అప్డేట్ లేదు.

సెట్స్ పైకి వెళ్తుందని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు గురించి ఇప్పుడో షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. విషయంలోకి వెళ్తే…మహేష్- త్రివిక్రమ్ ల సినిమా జ‌న‌వ‌రిలో పట్టాలెక్కాల్సి ఉండగా.. ఇప్పుడు పట్టాలెక్కే ఛాన్స్ లేదని వినికిడి. మ‌హేష్ కు ఇప్పుడు సర్జెరీ జరిగింది. అతనికి రెండు నెలల బెడ్ రెస్ట్ కావాలని వైద్యులు సూచించారు.మోకాలి ఆప‌రేష‌న్ కావడంతో మ‌హేష్ షూటింగ్ లో పాల్గొనడం కష్టం.

ఇక రెండు నెలలు పూర్తయ్యాక `స‌ర్కారు వారి పాట‌` ఫైనల్ షెడ్యూల్ లో మహేష్ పాల్గొంటాడని తెలుస్తుంది.అటు త‌ర‌వాత‌ మ‌హేష్… పూర్తిగా రాజ‌మౌళి సినిమా పైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.దాంతో త్రివిక్ర‌మ్ లేన‌ట్టే అనుకోవాలి. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకి మహేష్ హాజరైనప్పుడు కూడా త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి మహేష్ మాట్లాడింది లేదు. రాజమౌళి ప్రాజెక్టు గురించే మాట్లాడాడు. రాజమౌళి సినిమా ఉంది కదా అన్ని ఆటలు ఆడుకోవచ్చు అని ఎన్టీఆర్ అంటుంటే..

భయపెడతావ్ ఏంటి? అంటూ మహేష్ సరదాగా నవ్వేసాడు. అడివి శేష్ తో మేజర్ ప్రాజెక్టు గురించి, సర్కారు వారి పాట ప్రాజెక్టు గురించి కూడా మహేష్ ముచ్చటించాడు కానీ త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి మహేష్ స్పందించలేదు. బహుశా త్రివిక్రమ్ స్క్రిప్ట్ మహేష్ ను ఇంప్రెస్ చేసి ఉండకపోవచ్చు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus