పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి చేదు జ్ఞాపకం అంటే అది 2016 సమ్మర్ అనే చెప్పాలి. ఆ టైములో వచ్చిన పవన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ అలాగే మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు విడుదలయ్యాయి. రెండు సినిమాలకి నెలకు పైనే గ్యాప్ ఉంది. మొదటగా పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏప్రిల్ 8న విడుదలయ్యింది.. ఇక మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ మే 20న విడుదలయ్యింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా బ్లాక్ బస్టర్ అయినా.. మహేష్ సినిమా వచ్చే సరికి ఫుల్ రన్ ముగిసేది. కానీ పవన్ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.. వెంటనే మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోయి.. పవన్ సినిమాని ఓ రేంజ్లో టార్గెట్ చేసి ఆడుకున్నారు. అలా అని మహేష్ సినిమా హిట్ అయ్యిందా అంటే లేదు.. అంతకు మించిన డిజాస్టర్ అయ్యింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. మహేష్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్లో ఆడుకున్నారు.
ఇక అసలు విషయం ఏమిటంటే.. ఇప్పుడు మహేష్ బాబు 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా షూటింగ్ మొదలు కాలేదు కానీ.. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ కి విడుదల చెయ్యాలని ముందే ఫిక్సయ్యారట. మరో పక్క పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం చేయబోతున్నట్టు.. ఆ చిత్ర నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈరోజున అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని కూడా 2021 సమ్మర్ కానుకగా విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. నెల గ్యాప్లో ఇద్దరు బడా స్టార్లు సినిమాలు వస్తేనే.. సోషల్ మీడియాలో వీళ్ళ అభిమానులు ఓ రేంజ్లో గొడవలు పడుతుంటారు. అలాంటిది ఏ వారం గ్యాప్ లోనో.. రెండు వారాల గ్యాప్లోనే వీరి సినిమాలు వస్తే మాత్రం.. ఇంకెంత రేంజ్లో ట్రోల్ చేసుకుంటారో. ముందునుండే నిర్మాతలు రిలీజ్ విషయంలో జాగ్రత్తలు పడితే మంచిదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!