Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు 100సార్లు చూసిన సినిమా ఏదో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా యావరేజ్ టాక్ తో సైతం అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు 100 సార్లు చూసిన సినిమాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మోసగాళ్లకు మోసగాడు సినిమాను 100సార్లు చూశానని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. సుధీర్ బాబు (Sudheer Babu) మహేష్ తో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ను బయటపెట్టగా ఆడియో క్లిప్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

మరోవైపు మహేష్ జక్కన్న (SS Rajamouli) కాంబో మూవీ సెప్టెంబర్ లో అయినా మొదలవుతుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమా 2027లో విడుదల కానుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం అందుకుంటున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీలో నటించే నటీనటులు ఈ సినిమా కోసం పని చేసే పని చేసే టెక్నీషియన్లకు సంబంధించి క్లారిటీ రానుంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు కాగా రిలీజ్ సమయానికి ఈ సినిమా బడ్జెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ కు ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ కూడా కొత్తగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. రాజమౌళి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus