Mahesh Babu, Namrata: మరోసారి మంచి మనసు చాటుకున్న నమ్రత.. పేద విద్యార్థికి సాయం!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మహేష్ బాబు నమ్రత ఒకరు. వీరిద్దరూ సినిమాలలో అద్భుతమైన నటీనటులుగా రానిచ్చారు. ఇక నమ్రత మహేష్ బాబును వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ విధంగా నమ్రత సినిమాలకు దూరమైనప్పటికీ ఈమె మాత్రం మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు వ్యాపార రంగంలో నమ్రత ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక మహేష్ బాబు సినిమాలలో సక్సెస్ ఫుల్ హీరోగా రాణించడమే కాకుండా తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తూ మంచి మనసున్న హీరోగా పేరుపొందారు.ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించే వారికి పునర్జన్మ ప్రసాదించారు. ఇలా సేవా రంగంలో ఎప్పుడు ముందుండే మహేష్ బాబు దంపతులు తాజాగా మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు.

మహేష్ బాబు సతీమణి నమ్రత పేద విద్యార్థికి తనదైన శైలిలో సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నమ్రత ఈ మంచి పని చేశారు. ఓ పేద విద్యార్థికి ఏవియేషన్ చదువుకోవడం కోసం లాప్ టాప్ సహాయం చేశారు. ఆ విద్యార్థికి సహాయం చేసిన నమ్రత బాగా చదువుకొని తన కుటుంబానికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా, మీ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలని ఈమె విద్యార్థికి సూచించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ అభిమానులు మహేష్ బాబు దంపతుల మంచి మనసుకు ఫిదా అవ్వడమే కాకుండా వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus