అభిమానులు, ఫ్యామిలీ..తో కలిసి ‘గుంటూరు కారం’ వీక్షించిన మహేష్.. వీడియో వైరల్!

మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ ఈరోజు అంటే జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) నిర్మాత. తమన్ సంగీత దర్శకుడు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి గెస్ట్ రోల్ పోషించింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సృష్టిస్తుంది ఈ మూవీ.

కచ్చితంగా మొదటి రోజు ‘గుంటూరు కారం’ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు సినిమాలు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో భారీగా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సుదర్శన్ 70 ఎం.ఎం థియేటర్లలో మహేష్ బాబు సినిమాలు బాగా ఆడుతుంటాయి. చాలా మంది మహేష్ బాబు సినిమా అంటూ చూస్తే సుదర్శన్ 70.ఎం.ఎం లోనే చూడాలి అని అంటుంటారు.

మహేష్ బాబు (Mahesh Babu) కూడా తన సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా అప్పుడప్పుడు ఈ థియేటర్ కి వెళ్లి అభిమానులకి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. తాజాగా ‘గుంటూరు కారం’ సినిమాని అభిమానులతో కలిసి వీక్షించాడు మహేష్ బాబు. అతనితో పాటు దర్శకుడు త్రివిక్రమ్ అలాగే మరో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, అలాగే మహేష్ ఫ్యామిలీ(నమ్రత, గౌతమ్..లు) కూడా ‘గుంటూరు కారం’ ని వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus