మహేష్ పై గూఢచర్యం చేస్తున్న రకుల్!
- April 13, 2017 / 06:04 AM ISTByFilmy Focus
కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ అయి అభిమానులను ఆనందంలో ముంచింది. స్పైడర్ గా మహేష్ స్టైల్ అదిరిపోయింది. తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలను ఫస్ట్ లుక్ పెంచేసింది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్ ని కూడా రిలీజ్ చేసి ఉంటె బాగుండేదని ఆమె అభిమానులు నిరుత్సాహపడ్డాడు.
వారిని ఉత్సాహపరిచేందుకు మహేష్, రకుల్ ఉన్న ఫోటోని చిత్ర బృందం సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తోంది. స్పైడర్ లో ఆమె వైద్య విద్యార్థిగా నటిస్తున్నప్పటికీ.. ఈ ఫోటోని పరిశీలిస్తే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మహేష్ ని తీక్షణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్పైడర్ పై కన్నేసిన రకుల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విపరీతమైన షేర్లు అందుకుంటోంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 23 న థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















