Mahesh Babu: హాట్ టాపిక్ అయిన మహేష్ బాబు గడ్డం ఫోటోలు, వీడియోలు.!

సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానుల మధ్య.. ‘మా హీరో గొప్ప అంటే… మా హీరో గొప్ప’ అంటూ మాటల యుద్ధాలు ఏర్పడుతూ ఉంటాయి. హీరోల్లో ఉండే బలహీనతల్ని వేలెత్తి చూపుతూ వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్సనల్ లైఫ్ ని, అల్లు అర్జున్ (Allu Arjun) ఫేస్ ని, ఎన్టీఆర్ (Jr NTR)  హైట్ ని.. ఇలా ఏదో ఒక లోపాన్ని టార్గెట్ చేసి తోటి స్టార్ హీరో అభిమానులు ట్రోల్ చేస్తూ ఉంటారు.

Mahesh Babu

సరిగ్గా ఇలానే మహేష్ బాబును (Mahesh Babu) కూడా ‘మీ హీరోకి గడ్డం రాదు’ అంటూ మిగిలిన స్టార్ హీరోల అభిమానులు ఘోరమైన కామెంట్లు చేస్తుంటాయి. వాస్తవానికి మహేష్ బాబు కూడా గడ్డం పెంచడానికి ఎక్కువగా ఇష్టపడడు. ‘టక్కరి దొంగ’ (Takkari Donga) ‘మహర్షి’ (Maharshi) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) వంటి సినిమాల్లో కొద్దిపాటి గడ్డంతో కనిపించాడు. అందువల్లే మిగిలిన స్టార్ హీరోల అభిమానులకి టార్గెట్ అవుతూ ఉంటాడు. కానీ ఈసారి దర్శకుడు రాజమౌళితో (S. S. Rajamouli) సినిమా సెట్ చేసుకున్నాడు మహేష్.

జక్కన్న సినిమా అంటే.. పూర్తిగా ఆయన మాటే చెల్లుతుంది. ఎంతటి స్టార్ హీరో అయినా సరే.. ఆయనకు సరెండర్ అవ్వాల్సిందే. అందుకే రాజమౌళి సూచన మేరకు మహేష్ బాబు (Mahesh Babu).. బాగా గడ్డం పెంచాడు. తాజాగా మహేష్, నమ్రత (Namratha) ..కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. వరద బాధితుల సహాయార్థం మహేష్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అది రేవంత్ రెడ్డికి అందించేందుకు వెళ్లారు మహేష్ దంపతులు.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు గుబురు గడ్డంతో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. గతంలో మహేష్ బాబుకి గడ్డం రాదు అని నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లకు ఈ ఫొటోలతో ధీటైన సమాధానం చెబుతున్నారు మహేష్ అభిమానులు. మరోపక్క దసరాకి మహేష్ (Mahesh Babu) – రాజమౌళి సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని టాక్.

‘దేవర’ తెలుగు ప్రచారం ఫినిష్‌.. ఇక అంతా కొరటాల చేతిలోనే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus