Guntur Kaaram: గుంటూరు కారం : మహేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ వైరల్!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పై రాధాకృష్ణ( చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. కొన్నాళ్లుగా ఈ చిత్రం గురించి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ముందుగా అనుకున్న హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంది.

తర్వాత కెమెరామెన్ కూడా తప్పుకున్నాడు. ఒకానొక టైంలో ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది అనే కామెంట్స్ వినిపించాయి. కానీ నిర్మాతలు వాటిని తోసిపుచ్చారు.అయితే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు. కాబట్టి ..ఈ సినిమా నుండీ ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి. కాబట్టి.. ఓ పోస్టర్ ను వదిలారు. ఇందులో మహేష్ బాబు లుంగీ కట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నాడు. అలాగే కళ్ళజోడు .. నోట్లో సిగరెట్/బీడీ లాంటిది ..పెట్టుకుని వెలిగించుకుంటూ రఫ్ గా కూడా కనిపిస్తున్నాడు అని చెప్పాలి.

మహేష్ లుంగీ కట్టిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. మురారి, పోకిరి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు .. ఇలా అన్ని సినిమాలు సూపర్ హిట్లే. దీంతో మహేష్ అభిమానులు ఈ మాస్ లుక్ తో హ్యాపీగా ఫీలవుతున్నారు అని చెప్పాలి. దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. జనవరి 12 న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం (Guntur Kaaram) విడుదల కాబోతున్నట్లు కూడా ప్రకటించారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus