Mahesh Babu: మహేష్ బాబు న్యూ లుక్.. ఏం ప్లాన్ చేశావ్ జక్కన్న?

సూపర్ స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu) రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో రూపొందనున్న SSMB29 కోసం సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు ఇటీవల ఫారిన్ ట్రిప్ చేసి ప్రత్యేకంగా తన లుక్ మార్చుకొని వచ్చాడు. లాంగ్ హెయిర్, గెడ్డంతో కనిపించిన కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. SSMB29 లో మహేష్ బాబు ఇదే లుక్‌లో కనిపిస్తారని అందరూ భావించారు. అయితే, రీసెంట్ గా మహేష్ బాబు తన లుక్ ని మళ్ళీ మార్చేశాడు, రెగ్యులర్ స్టైల్‌లో తిరిగి వచ్చినట్లు అభిమానులు గమనించారు.

Mahesh Babu

కీరవాణి  (M. M. Keeravani) తనయుడు శ్రీ సింహా (Sri Simha Koduri) ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో హాజరైన మహేష్, సరికొత్తగా ట్రిమ్ చేసిన లుక్‌తో దర్శనమిచ్చాడు. హెయిర్ స్టైల్ కూడా మారింది. ఈ మార్పు రాజమౌళి ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏదైనా కొత్త ప్లాన్ ఉండొచ్చనే ఊహాగానాలకు దారితీసింది. అభిమానులలో ఇప్పుడు ఈ మార్పు వెనుక అసలు కారణమేమిటని ఆసక్తి పెరుగుతోంది. రాజమౌళి, సాధారణంగా తన హీరోల లుక్స్ గురించి గట్టి నియంత్రణ పాటిస్తారని అందరికీ తెలుసు.

SSMB29 సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) లుక్‌కి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందనే విషయం తెలిసిందే. అయితే మొన్నటి లాంగ్ హెయిర్ లుక్ ఫైనల్ గా ఉపయోగిస్తారా, లేక కొత్త లుక్ కోసం ఇంకేమైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అనే విషయంలో స్పష్టత లేదు. ఇకపోతే, మహేష్ ప్రస్తుతం వర్క్‌షాప్ లో పాల్గొంటున్నారని సమాచారం. స్క్రిప్ట్ మీద వర్క్ పూర్తి కావచ్చింది, షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుందని టాక్. క్యాస్టింగ్ ప్రక్రియ కూడా ముగిసిందని అంటున్నారు.

ఈ నేపధ్యంలో మహేష్ బాబు లుక్ మార్పు వెనుక రాజమౌళి ఆలోచన ఎంటనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ RRR (RRR)  తర్వాత రాజమౌళి తీసుకుంటున్న గ్లోబల్ లెవెల్ మూవీ కావడంతో, ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు ఇప్పటికే టాక్ ఉంది.

రివ్యూ: ‘నయనతార జీవితం’లో ఏముంది? ఏం చూపించారు? ఏం చెప్పారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus