Mahesh Babu: బుల్లితెర రేటింగ్ లో మహేష్ మరో రికార్డ్.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలు వెండితెరపై ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో బుల్లితెరపై అంతకు మించి సంచలనాలు సృష్టించిన సందర్భాలు అయితే ఉన్నాయి. బుల్లితెరపై 1000 కంటే ఎక్కువసార్లు ప్రసారమై అతడు మూవీ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. బుల్లితెరపై సరిలేరు నీకెవ్వరు మూవీ తక్కువసార్లే ప్రదర్శితం అయినా టెలీకాస్ట్ అయిన ప్రతిసారి మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటోంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా బుల్లితెరపై ప్రసారం కాగా ఈ సినిమాకు 7.01 రేటింగ్ వచ్చింది.

Mahesh Babu

బుల్లితెరపై ఎక్కువసార్లు ప్రదర్శితమైన సినిమాలలో ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) సినిమాదే రికార్డ్ అని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలై దాదాపుగా నాలుగేళ్లు అవుతున్నా ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డులు మాత్రం చేరుతూనే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బుల్లితెర రేటింగ్స్ విషయంలో మహేష్ బాబుకు సాటెవ్వరు అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో నటించడం వల్ల మరో రెండేళ్ల పాటు మహేష్ బాబు సినిమాలేవీ విడుదలయ్యే అవకాశం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎన్నేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంటుందో చూడాల్సి ఉంటుంది. మహేష్ జక్కన్న తమ సినిమాతో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. సాధారణంగా జక్కన్న సినిమాలు ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ జరుపుకోవు. అయితే ఈ సినిమా కోసం మాత్రం రాజమౌళి విదేశీ లొకేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజమౌళి సరికొత్త టెక్నాలజీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మహేష్ జక్కన్న కాంబో ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో హిట్టవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. మహేష్ జక్కన్న కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని 3000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చరణ్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus