మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ ఇదే!

సరిలేరు నీకెవ్వరు సినిమాతో సక్సెస్ ను అందుకున్న మహేష్ బాబు ఈ నెల 12వ తేదీన సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహేష్ ఒరిజినల్ వయస్సు 46 అయినా సర్కారు వారి పాట ట్రైలర్ చూసిన వాళ్లు మాత్రం మహేష్ బాబు పాతికేళ్ల కుర్రాడే అని కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు అందంగా కనిపించడం వల్లే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే స్టార్ హీరోకు లేని స్థాయిలో మహేష్ బాబుకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సర్కారు వారి పాట ట్రైలర్ కు ఇప్పటికే 32 మిలియన్ల వ్యూస్ రాగా 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబర్1 లో కొనసాగుతూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సర్కారు వారి పాట ట్రైలర్ లో మహేష్ బాబు గ్లామర్ గా కనిపించడం గురించి చెబుతూమైంటైన్ చేయలేక ఎంతో కష్టపడుతున్నాను అంటూ తనపై తాను సెటైర్ వేసుకున్నారు. అందంగా కనిపించడం కోసం తాను ఎంతో కష్టపడుతున్నానని మహేష్ చెప్పకనే చెప్పేశారు.

ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ మహేష్ బాబు ప్రతిరోజూ ధ్యానం చేస్తారని అందువల్లే మహేష్ కూల్ గా, ఛార్మింగ్ గా, అందంగా కనిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు మూన్ ధ్యానం చేస్తారని ఈ ధ్యానం చేయడం వల్ల ట్రాన్స్ లోకి వెళ్లిపోవడంతో పాటు శరీరంను, మనస్సును ఆధీనంలోకి తెచ్చుకోవడం సాధ్యమవుతుందని ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్లకు నిత్య యవ్వనం ప్రాప్తిస్తుందని రామ్ లక్ష్మణ్ మాస్టర్లు వెల్లడించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహేష్ అభిమానులు కూడా ఆయనలా అందంగా కనిపించడానికి మూన్ ధ్యానం చేస్తారేమో చూడాలి. ధ్యానంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం, వ్యాయామం చేయడం వల్ల మహేష్ బాబు ఇంత అందంగా కనిపిస్తున్నారని బోగట్టా. సర్కారు వారి పాట సినిమాతో మహేష్ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus