నమ్మలేని వీడియో ఎడిట్‌.. ఫ్యాన్స్‌కి అయితే ఫీస్ట్‌!

ఒక హీరో చేసిన సినిమా మరో హీరో చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్న చాలాసార్లు మీరు వినుంటారు. అంతెందుకు మీకు మీరు వేసుకునుంటారు కూడా. ఎందుకంటే ఆ సీన్‌లో మా హీరో అయితే అదరగొట్టేవాడు, ఈ సీన్‌లో దుమ్మురేపేవాడు అని లెక్కలేసుకోని అభిమాని ఉండడు. అలా కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా చూసి మా హీరో మహేష్‌బాబుకు ఈ సినిమా పడి ఉంటే బాగుండు అని అనుకున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే.

ఒకవేళ మీకు హృతిక్‌ రోషన్‌, టామ్‌ క్రూజ్‌ అభిమానులు అయితే మీ కోసం కూడా ఈ వీడియో. ఎందుకంటే ‘విక్రమ్‌’ సినిమాలో మహేష్‌ బాబు, హృతిక్‌ రోషన్‌, టామ్‌ క్రూజ్‌ నటిస్తే ఎలా ఉంటుంది అని ఓ నెటిజన్‌ వీడియో రూపొందించాడు. ‘విక్రమ్‌’ తెలుగు ట్రైలర్‌లో మహేష్‌, హృతిక్‌, టామ్‌ క్రూజ్‌ను యాడ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

ఈ ఫ్యాన్‌ ఎడిట్‌ వీడియలో కమల్‌హాసన్‌ రోల్‌లో మహేశ్‌బాబు కనిపిస్తాడు. ఇక ఫహాద్‌ ఫాజిల్‌గా టామ్‌ క్రూజ్‌ ఉంటాడు. అలాగే విజయ్‌ సేతుపతిగా హృతిక్‌ రోషన్‌ కనిపిస్తాడు. సీన్స్‌కి పర్‌ఫెక్ట్‌గా సింక్‌ అయ్యేలా వేరే సినిమాల నుండి ఫుటేజ్‌ తీసుకొని ఈ వీడియోను రూపొందించారు. దీంతో ఈ వీడియోకు లైక్‌లు, రీట్వీట్లు మోగుతున్నాయి. ఇక ‘విక్రమ్‌’ సినిమా విషయానికొస్తే కమల్‌ హాసన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు.

మాదక ద్రవ్యాల నిషేధం నేపథ్యంలో లోకేశ్‌ కనగరాజ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై ఐదు నెలలు అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు అంటే ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ కొన్ని ఫ్యాన్‌ మేడ్‌ వీడియోలు వచ్చాయి. వాటిని కూడా ఫ్యాన్స్‌ ఇలానే ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్‌ చేయండి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus