ప్రముఖ టెక్నీషియన్లతో తెరకెక్కనున్న సూపర్ స్టార్ 24 మూవీ

టాలీవుడ్ టాప్ హీరోలతో విజయాలు సొంతం చేసుకున్న కొరటాల శివ తర్వాతి ప్రాజక్ట్ పై ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన నెక్స్ట్ సినిమా అని చెప్పిన హిట్ డైరక్టర్ .. తాజాగా మరిన్ని సంగతులను వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని , ‘శ్రీమంతుడు’ మాదిరిగానే సోషల్ మెసేజ్ ను ఇస్తూ, వినోదాత్మకంగా సాగుతుందని చెప్పారు. మహేశ్ అభిమానులకి పూర్తి స్థాయిలో ఆనందాన్ని కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని స్పష్టం చేశారు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడం తో కొరటాల రెమ్యునరేషన్ పెరిగింది.

మహేష్ ప్రాజెక్ట్ కావడంతో ప్రముఖ టెక్నీషియన్లు, సీనియర్ నటులు ఇందుకోసం పనిచేయనున్నారు. అందుకు అనుగుణం గానే ఈ చిత్ర బడ్జెట్ 80 కోట్లు కానుందని సమాచారం. ఖర్చుకు వెనకాడకుండా నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ ఫిల్మ్ కోసం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకునిగా ఎంపిక చేశారు. ఇతర టెక్నీషియన్లను త్వరలో వెల్లడించనున్నారు. కొరటాల గత చిత్రాల్లో సత్య రాజ్ (మిర్చి), జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ (శ్రీమంతుడు), మోహన్ లాల్ (జనతా గ్యారేజ్) వంటి సీనియర్ నటులను తీసుకున్నారు. నాలుగో చిత్రంలోనూ ప్రముఖ నటులను కొత్త పాత్రల్లో తీసుకోనున్నట్లు సమాచారం. జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని సంగతులు త్వరలో వెల్లడికానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus