ఆలస్యంగా మొదలు కానున్న మహేష్, కొరటాల మూవీ
- December 5, 2016 / 02:19 PM ISTByFilmy Focus
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ సాధించింది. నాన్ బాహుబలి రికార్డులన్నీ సొంతం చేసుకుంది. మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. ఆ మూవీ ఎప్పుడు వస్తుందా ? అని ఇప్పటి నుంచే ఎదురు చూస్తుంటారు. గత నెల పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో ఫ్యాన్స్ సంబర పడిపోయారు. తొందరగానే మరో బ్లాక్ బస్టర్ ని చూడడనున్నామని అనుకున్నారు. కానీ ఆ చిత్రం ముందుగా అనుకున్నట్లు జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లడం లేదు. ఫిబ్రవరి కి పోస్ట్ పోన్ అయింది. దీని కారణం ప్రస్తుతం చేస్తున్న ప్రాజక్టే.
కమర్షియల్ డైరక్టర్ ఏ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో ప్రిన్స్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పటివరకు 70 శాతం కంప్లీట్ చేసుకుంది. అహ్మదాబాద్ లో కొన్ని ఈ నెల 23 వరకు షూట్ చేయనున్నారు. దీంతో ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవుతుందని అందరూ భావించారు. కానీ వచ్చే నెల కూడా షూటింగ్ ఉంటుందని తాజాగా తెలిసింది. డిసెంబర్ 24 నుంచి కుటుంబ సభ్యులతో విదేశాలకు విహారానికి వెళ్లి జనవరి 2 న హైదరాబాద్ చేరుకొని కొరటాల దర్శకత్వంలో నటించాలని మహేష్ ప్లాన్ చేశారు. కానీ మురుగ దాస్ మరికొన్ని డేట్స్ కొరేటప్పటికీ ప్లాన్ చేంజ్ అయింది. కొరటాల మూవీ ఓ నెల పోస్ట్ పోన్ అయింది. ప్రారంభం లేట్ అయితే లేటుగానే రిలీజ్ అవుతుంది. సో కొరటాల, ప్రిన్స్ మూవీ కోసం మరో నెల అదనంగా వేచి చూడాలన్న మాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















