మహేష్, మురుగదాస్ సినిమాకు వేగంగా జరుగుతున్న సెట్ పనులు
- January 4, 2017 / 12:01 PM ISTByFilmy Focus
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ డైరక్షన్లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ కొత్త షెడ్యూల్ జనవరి 7 వ తేదీ నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఇందుకోసం ఓ స్టూడియోలో ప్రత్యేక సెట్ వేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి సాగుతున్న ఈ పనుల్లో వేగం పెంచారు. కేవలం మూడు రోజులే ఉండడంతో నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు దగ్గరుండి సెట్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఫ్యామిలీతో కలిసి స్విడ్జర్లాండ్ టూర్ కి వెళ్లిన మహేష్ రెండు రోజుల్లో నగరానికి రానున్నారు. ల్యాండ్ అయిన నెక్స్ట్ డే నుంచే షూటింగ్ లో పాల్గొననున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ లో ప్రిన్స్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. డైరక్టర్, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంభవామి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













