కమర్షియల్ డైరక్టర్ ఏ ఆర్ మురుగదాస్ కి హైదరాబాద్ నగరం బాగా నచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీని భాగ్యనగరంలోనే ఎక్కువభాగం చిత్రీకరిస్తున్నారు. నెల రోజులుగా హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై ఛేజింగ్ సీక్వెన్స్ ని షూట్ చేసిన బృందం, దీపావళికి బ్రేక్ ఇచ్చింది. పండుగ తర్వాత గుజరాత్ వెళ్లాలని భావించిన మురుగదాస్ తన ప్లాన్ ని మార్చుకున్నారు.
ఇక్కడ షూటింగ్ కి అనువగాను, లొకేషన్స్ చక్కగా ఉండడంతో మరికొన్ని రోజులు ఇక్కడే షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. రేపటి నుంచి మొదలయ్యే కొత్త షెడ్యూల్ లో ప్రిన్స్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లపై రొమాంటిక్ సన్ని వేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ నవంబర్ 1 నుంచి 23 వరకు కొనసాగుతుందని సమాచారం. తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్న ఈ మూవీ వేసవికి రిలీజ్ కానుంది.