తెలుగు చిత్ర సీమలోని స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. తెరపైన సూపర్ స్టార్ అయినా ఇంట్లో మాత్రం సాధారణమైన భర్త, తండ్రి. పిల్లలను మంచి మార్గంలో నడిపించడానికి, ప్రేమానురాగాలు కురిపించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. విదేశాల్లో షూటింగ్ జరిగినా ప్రతి రోజు పిల్లలతో మాట్లాడుతుంటారు. కొడుకు గౌతమ్ కృష్ణ తో పాటు కూతురు సితార కూడా ప్రస్తుతం స్కూల్ కి వెళుతోంది. వారికోసం మహేష్ కొత్త నిర్ణయం తీసుకున్నాడు.
తన వద్దకు వచ్చే ఫిలిం మేకర్స్ ని షూటింగ్ ఉదయం పది గంటల తర్వాత పెట్టుకోమని అడుగుతున్నారు. చిన్నారులను స్కూల్ కి పంపించిన తర్వాత షూటింగ్ వస్తానని, అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. ఆర్డర్ వేయగల స్థాయిలో ఉన్నా సూపర్ స్టార్ రిక్వెస్ట్ చేస్తుండడం చూసి డైరక్టర్లు ఆశ్చర్య పోతున్నారంట. ప్రొఫిషినల్ గా ఎంత బిజీగా ఉన్నా, పర్సనల్ లైఫ్ పై ఆ ప్రభావం పడకుండా బ్యాలన్స్ చేసుకుంటున్న మహేష్ ని అభినందించక ఉండలేక పోతున్నారు. కృష్ణ లాగే మహేష్ కూడా గ్రేట్ ఫాదర్ అనిపించుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు.