స్పైడర్ రిలీజ్ కి మహేష్ అడ్డుగా మారాడా!!.. అసలు మీకు మతి ఉండే వార్తలు రాస్తున్నారా? .. అని ఈ హెడ్డింగ్ చదవగానే మీలో కోపం రావడం సహజమే. కానీ మేము చెప్పింది మాత్రం నిజం. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. టాకీ పార్ట్ కి డబ్బింగ్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఏకకాలంలో తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా కానుకగా సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయడానికి నిర్మాత ఎన్.వి.ప్రసాద్ అంత క్లియర్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు లో రిలీజ్ కి మహేష్ ఎటువంటి అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయాలనీ నిర్మాత అనుకున్నారంట.
ఎందుకంటే మురుగదాస్, మహేష్ లకు బాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉంది. భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. అయితే అక్కడ రిలీజ్ విషయంలో తాను ఒకే అనేవరకు ఆగమని మహేష్ నిర్మాతకు చెప్పినట్లు టాక్. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటని ఆరా తీయగా.. స్పైడర్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత, దానిని చూసి బాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగినట్లు ఉంటేనే రిలీజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బాలీవుడ్ లో తన ఎంట్రీ హిట్ సినిమాతోనే ఉండాలని మహేష్ నిర్ణయించుకున్నారు. అందుకే ఇటువంటి కండిషన్ పెట్టారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.