మహేష్ 23 ఫస్ట్ లుక్ రిలీజ్ వెనుక కారణం ఏంటో తెలుసా ?
- April 11, 2017 / 01:17 PM ISTByFilmy Focus
బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కాబోతోంది. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ తో ప్రిన్స్ చేస్తున్న ఈ సినిమా లుక్ చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. చివరికి అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలంటే ఏదైనా స్పెషల్ డే అయి ఉండాలి. రేపు ఏ పండుగ లేదు. పోనీ మహేష్, కృష్ణ, గౌతమ్ కృష్ణ పుట్టినరోజు కాదాయే. అయినప్పటికీ రేపు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు ? అని ఫిలిం నగర్ వాసుల్లో చర్చ మొదలయింది. షూటింగ్ హడావుడి తగ్గిపోయిన తర్వాత రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావించిందని కొందరు అంటుంటే.. మరికొందరు వేరే కారణం చెబుతున్నారు.
ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. తమళనాడు ప్రజలు ఏప్రిల్ 14న తమిళ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఆ రోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని మురుగదాస్ భావించినా, తెలుగు అభిమానులు ఫీలవుతారని రేపు విడుదల చేయమని మహేష్ చెప్పిన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా మహేష్ 23 మూవీ లుక్ తో పాటు టైటిల్ కూడా కొన్ని గంటల్లో రివీల్ కానుంది. అది చాలు అభిమానులకు పండుగ చేసుకోవడానికి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















