సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా చేస్తున్న ద్విభాషా చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. వందకోట్ల బడ్జెట్ తో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 23 న రిలీజ్ కానుంది.ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి అయిపోయినట్లు తెలిసింది. ఏపీ థియేటర్ హక్కులు 36 కోట్లు, నైజాం థియేటర్ హక్కులు 20 కోట్ల వరకు పలుకుతున్నట్లు సమాచారం.
ఓవర్ సీస్ హక్కులు మూడు భాషలకు కలుపుకుని మరో 20 కోట్లు చెల్లించేందుకు విదేశీ డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు. మురుగదాస్ కి తమిళంలో మంచి క్రేజ్ ఉండడంతో అక్కడ థియేటర్ హక్కులు 28 కోట్లు పైనే అడుగుతున్నారు. ఇక తెలుగు, హిందీ శాటిలైట్ హక్కుల రూపంలో 26 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. సో ఇలాగా మహేష్ 23 ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు చేస్తుందని భావిస్తున్నారు. ఇంకా ఎక్కువగా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే మహేష్, మురుగదాస్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.