Major, Vikram: ‘మేజర్’ ‘విక్రమ్’ సినిమాలు… నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకు ధైర్యాన్ని ఇచ్చాయి..!

  • June 8, 2022 / 10:14 AM IST

పవన్ కళ్యాణ్ పై రాజకీయ పరంగా ఉన్న కక్షతో ‘వకీల్ సాబ్’ చిత్రం టైములో టికెట్ రేట్లు భారీగా తగ్గించేస్తూ జీవోలు అమలు చేసింది జగన్ ప్రభుత్వం. ఏమైనా గట్టిగా మాట్లాడితే ఆ కారణం.. ఈ కారణం చెప్పి థియేటర్లు మూసేయడానికి కూడా వెనుకాడలేదు. అక్కడితో ఆగలేదు టాలీవుడ్ పెద్దల్ని తమ వద్దకు రప్పించుకుని ఎన్నో అవమానాలు కూడా చేసింది. ఆంధ్రాలో టికెట్ రేట్లు తగ్గించడంతో.. అక్కడి నష్టాన్ని భర్తీ చేయడం కోసం నైజాంలో టికెట్ రేట్లు డబుల్ చేశారు.

2020 నాటికి రూ.150 ఉండే టికెట్ రేటు.. ఇప్పుడు రూ.295 అయ్యింది. ఇది చాలదన్నట్టు పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల హైక్ లు కావాలని ప్రభుత్వాలని అడిగి మరీ కొన్ని పెద్ద సినిమాల యూనిట్లు. దాంతో మొదటికే మోసం వచ్చినట్టు అయ్యింది. ‘ఆచార్య’ ‘రాధే శ్యామ్’ వంటి బడా సినిమాలు తీవ్ర నష్టాలు పాలయ్యాయి అంటే టికెట్ రేట్లు భారీగా పెంచేయడం వల్లనే అని చెప్పాలి. ‘భీమ్లా నాయక్’ ‘సర్కారు వారి పాట’ వంటి చిత్రాలకి లాభాలు రాకపోవడానికి కూడా కారణం అదే.

అయితే ‘ఎఫ్3’ సినిమాకు నార్మల్ టికెట్ రేట్లు ఉన్నా… ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించినా మంచి కలెక్షన్లు నమోదు చేశాయి. ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి చిత్రాలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు తెచ్చిపెట్టాయి. ‘ఎఫ్3’ మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. అయితే ‘మేజర్’ ‘విక్రమ్’ ల బాటలోనే ‘పక్కా కమర్షియల్’ వంటి చిత్రాలు కూడా రీజనబుల్ టికెట్ రేట్లకి రిలీజ్ కాబోతుంది.

ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలను థియేటర్ కు రప్పించాలి అంటే టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అని నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకు తెలిసొచ్చింది. ఓ రకంగా మేజర్, విక్రమ్ సినిమాల ఫలితాలు వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాయనే చెప్పాలి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus