Prakash Raj: వామ్మో.. ప్రకాష్ రాజ్ లో ఇంత మార్పా?

ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించే ప్రతిభ ఉన్న ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మెగా క్యాంప్ మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉండటంతో ఎన్నికలు జరిగితే ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ గతంతో పోలిస్తే బాగా మారారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో కొన్ని అంశాల్లో రిజర్వ్డ్ గా ఉన్న ప్రకాష్ రాజ్ సినిమా ఫంక్షన్లకు,

ఎలక్ట్రానిక్ మీడియాకు దూరంగా ఉండేవారు. అయితే ప్రస్తుతం చిన్న సినిమాల ఫంక్షన్లకు కూడా ప్రకాష్ రాజ్ హాజరవుతూ ఆ సినిమాలపై క్రేజ్ పెరగడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. గడిచిన 15 రోజుల్లో ప్రకాష్ రాజ్ మూడు కార్యక్రమాలకు హాజరయ్యారంటే ఆయన ఎంతలా మారారో సులభంగానే అర్థమవుతుంది. తాజాగా భగత్ సింగ్ నగర్ టీజర్ రిలీజ్ వేడుకలో ప్రకాష్ రాజ్ పాల్గొనగా ఆ ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేస్తున్న ఏవీని నిర్వాహకులు ప్రదర్శించారు.

ప్రకాష్ రాజ్ ఆ ఈవెంట్ లో మా ఎన్నికల గురించి ప్రస్తావించవద్దని చెప్పారు. ‘మా’ ఎన్నికలే ప్రకాష్ రాజ్ లో మార్పుకు కారణమని చాలామంది అభిప్రాయపడుతుంటే ప్రకాష్ రాజ్ మాత్రం వాటి గురించి ప్రస్తావించవద్దని చెబుతుండటం గమనార్హం. సాధారణంగా ‘మా’ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ఈవెంట్లలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ముందుగానే ఈవెంట్లలో పాల్గొంటూ ‘మా’ పదవికి ఎంపికైనా తగినంత సమయం కేటాయిస్తానని చెప్పకనే చెబుతున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus