Major Movie: మరో ఘనత సాధించిన మేజర్.. సంతోషం వ్యక్తం చేస్తున్న చిత్ర బృందం?

ఇండియన్ పనోరమా ఆధ్వర్యంలో 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకను గోవాలో ఎంతో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 53 వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్స్ నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు ఎంతో ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలో భాగంగా అత్యంత ఆదరణ పొందిన పలు చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శింపబడతారు. ఈ క్రమంలోనే 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడే సినిమాల జాబితాను తాజాగా విడుదల చేశారు

ఈ జాబితాలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హీరో అడివి శేష్ నటించిన మేజర్ సినిమా ఎంపిక అయింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మేజర్ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ సినిమా విడుదలై కొన్ని నెలలు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 (IFFI) కోసం ఎంపికైంది అని తెలియజేస్తూనే హీరో అడివి శేష్, నటి సయీ మంజరేకర్, మహేష్ బాబు, శశికిరణ్ తిక్క, సోనీ పిక్చర్స్ ఇండియాని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముంబై దాడులలో భాగంగా టెర్రరిస్టులతో పోరాడి వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పై ఎంతోమంది ప్రశంసలు కురిపించడమే కాకుండా పెద్ద ఎత్తున కలెక్షన్లను కూడా రాబట్టింది.32 కోట్ల రూపాయల బడ్జెట్ తో తిరిగి ఎక్కిన ఈ సినిమా ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus