అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ ‘ఎ ప్లస్ ఎస్ మూవీస్’ బ్యానర్ల పై మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి సంచలనం సృష్టించింది.వీక్ డేస్ లో కూడా ఈ మూవీ బాగా రాణించింది.అలాగే 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 7.67 cr |
సీడెడ్ | 1.80 cr |
ఉత్తరాంధ్ర | 2.01 cr |
ఈస్ట్ | 1.37 cr |
వెస్ట్ | 0.88 cr |
గుంటూరు | 1.17 cr |
కృష్ణా | 1.01 cr |
నెల్లూరు | 0.64 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 16.55 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.80 cr |
ఓవర్సీస్ | 5.95 cr |
రెస్ట్ | 4.62 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 28.92 cr |
‘మేజర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం 10 రోజులు పూర్తయ్యేసరికి రూ.28.92 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు రూ.13.92 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!