Major Movie: అక్కడి ట్రేడ్ పండితులకి షాక్ ఇచ్చిన ‘మేజర్’..!

టాలీవుడ్లో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అడివి శేష్… ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి హిట్ చిత్రాలతో మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. హీరోగానే కాకుండా.. రైటర్ గా తన సత్తా చాటుకున్నాడు. శేష్ నుండీ ఇటీవల వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మేజర్’ కి కూడా రైటర్ గా కూడా వ్యవహరించారు. సందీప్ ఉన్నికృష్ణన్ గా ఈ చిత్రంలో అడివి శేష్ కరెక్ట్ గా సూట్ అయ్యాడు.

ఈ పాత్రకి అతను నూటికి నూరు శాతం న్యాయం చేశాడనే చెప్పాలి. ‘మేజర్’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. 2 వారాలు పూర్తి కావస్తున్నా కానీ ఈ మూవీ ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తుంది. రూ.60 కోట్ల గ్రాస్ మార్క్ కు దగ్గర పడిన ఈ మూవీ తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. తెలుగుతో పాటు ఈ మూవీ హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

రెండు భాషల్లోనూ కలుపుకుని ఈ మూవీని రూ.5 కోట్లకి విక్రయించారు. వీకెండ్ వరకు పెర్ఫార్మన్స్ చాలా డల్ గా ఉంది. కానీ మొత్తానికి అక్కడ రూ.5.4 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను సాధించింది ఈ మూవీ. అక్కడ ఓవరాల్ గా అడ్వాన్స్ బేసిస్ మీదే ‘మేజర్’ చిత్రాన్ని విడుదల చేశారు. మొదటి వీకెండ్ పెర్ఫార్మన్స్ ను బట్టి అక్కడ ఈ మూవీ నష్టాలు మిగల్చడం ఖాయం అని ట్రేడ్ పండితులు కామెంట్లు చేశారు.

కానీ ఈ చిత్రం స్లోగా పికప్ అయ్యి టార్గెట్ ను పూర్తి చేసింది.దీంతో అక్కడి ట్రేడ్ పండితులకు షాక్ తగిలినట్టు అయ్యింది. హిందీలో పోటీగా ‘భూల్ భులైయా2’, మలయాళం లో ‘విక్రమ్’ వంటి సినిమాలు లేకపోతే ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసి ఉండేది. ఇక ‘మేజర్’ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా నటించగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus