Major OTT: రెండు నెలల తరువాతనే నెట్ ఫ్లిక్స్ లో మేజర్?

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో సాయి మంజ్రేకర్, శోభిత హీరోయిన్లుగా మహేష్ బాబు
జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మేజర్. 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా మొదటి షో నుంచి అద్భుతమైన హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇప్పటివరకు భారత దేశ చరిత్రలో ఏ సినిమా సాధించలేని అరుదైన రికార్డును ఈ సినిమా సాధించింది దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో ఈ సినిమా ప్రీమియర్ షోలు వేస్తూ సరికొత్త రికార్డును సృష్టించారు. ఇక ప్రస్తుతం థియేటర్లో కూడా ఈ సినిమా అద్భుతమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రన్ అవుతుంది.

సాధారణంగా థియేటర్ లో విడుదలైన తర్వాత థియేటర్ రన్ పూర్తికాగానే ఆ సినిమా ఓటీటీలో విడుదలయ్యే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మేజర్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సినిమా థియేటర్లో విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీలో విడుదల కాబోతుందని తెలుస్తోంది.ప్రస్తుతం మేజర్ సినిమా అయితే ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ సొంతం చేసుకోగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలా దూసుకుపోతుందో తెలియాల్సి ఉంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus