బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ సినిమాని తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో రాజమౌళి సైతం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీలో సెప్టెంబర్ రెండవ తేదీ ఎంతో ఘనంగా ప్లాన్ చేశారు. అయితే గణేష్ ఉత్సవాల నిమిత్తం పోలీసులు మొత్తం గణేష్ ఉత్సవాల బందోబస్తులో ఉండగా ఈ వేడుకకు బందోబస్తు ఇవ్వలేమని పోలీస్ అధికారులు వెల్లడించడంతో చేసేదేమీ లేక చిత్రబృందం ఈ వేడుకను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను రాజమౌళి భారీ ఎత్తున నిర్వహించడం కోసం భారీగా ఖర్చు చేయించినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా ఇక ఈవెంట్ ప్రారంభమవుతుందన్న సమయంలో క్యాన్సిల్ కావడంతో నిర్మాతలు సైతం భారీగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ కావడంతో నిర్మాతలు ఏకంగా 2.25 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమాలో రణబీర్ కపూర్ చేతి నుంచి అగ్ని విసిరేశక్తిని కలిగి ఉంటారు. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా భారీగా ఫైర్ ప్లాన్స్ చేశారని అందుకే ఈ వెంట్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా ఈ వేడుక రద్దు కావడంతో నిర్మాతలకు బారిగానే నష్టం వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ రద్దు కావడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ చేస్తున్నారు.