వెంకటేష్ (Venkatesh) హీరోగా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)..లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam). ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అపజయమంటూ తెలీని అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకుడు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చాయి. భీమ్స్ (Bheems Ceciroleo) ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.
సినిమాలో పాటలన్నీ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉంటాయని టీం చెబుతుంది. అయితే ఈ సినిమా నుండి ఇంకా టీజర్ ను విడుదల చేసింది లేదు. వాస్తవానికి వెంకటేష్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 13న టీజర్ వదులుతారు అని అంతా భావించారు. కానీ టీజర్ కట్..వర్క్ జరగకపోవడం వల్ల ఆ టైంకి ఇవ్వలేకపోయారు అని మేకర్స్ చెప్పుకొచ్చారు.
కానీ ఇన్సైడ్ టాక్ వేరేగా వినిపిస్తుంది. అదేంటంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది చాలా లైటర్ వేన్ కథ అని తెలుస్తుంది. మొత్తం ఎంటర్టైన్మెంట్ పైనే ఈ సినిమా కథనం ఉంటుందట. అందువల్ల టీజర్ ను వెంటనే రిలీజ్ చేస్తే.. కథ రివీల్ అయిపోతుంది అని నిర్మాతలు భయపడుతున్నట్లు సమాచారం.
కొద్దిరోజుల క్రితం ‘మా సినిమా కథని గెస్ చేయండి’ అంటూ టీం మీడియాకి పజిల్ పెట్టడం వల్ల కూడా చాలా వరకు కథ లీక్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారట. అందుకే టీజర్ వదలకుండా ట్రైలర్ నే రిలీజ్ చేయాలని చాలా పగడ్బందీగా టీం.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ కట్లు చేయిస్తున్నట్టు వినికిడి.