మాతృత్వం. అల్లరి చేసే అమ్మాయిల్లో మార్పు తెచ్చే అమృతం. పెళ్లి అయి భార్యగా మారిన కూడా పోనీ చిలిపితనం ఛాయలు అమ్మగా మారిన వెంటనే చెరిగిపోతాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆమె ఇష్టాలు, ఆనందాలు మారిపోతాయి. తనకు బిడ్డకు ఏదయితో ఇష్టమో అదే తన ఇష్టం. బిడ్డ కడుపు నిండా తింటే తన ఆకలి తీరిపోతుంది. అందుకే అమ్మ కనిపించే దైవం. బిడ్డలకోసం అన్నింటిని త్యాగం చేసే తల్లుల గురించి చెప్పే ప్రయత్నమే మకురం.
కృష్ణ చైతన్య సొంతంగా కథ రాసుకొని దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రతి ఒక్కరికీ అమ్మ ప్రేమను గుర్తుకు తెస్తుంది. అమ్మాయిలు, అబ్బాయిలు, యూత్, పెద్దవారు అని తేడాలేకుండా ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన లఘు చిత్రం ఇది. ఈ చిత్రంలోని “అప్పుడప్పుడు నిజం కన్నా, నమ్మకమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది” అనే డైలాగ్ మాదిరిగా.. ఈ సారికి మా మాట నమ్మి ఈ వీడియోని చూడండి తప్పకుండా సంతోషం ఇస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.