మలైకా అరోరా- అర్జున్ క‌పూర్ పెళ్ళి డేట్ ఫిక్స్ ?

ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ లు గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య తరచూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్న ఈ జంట ఇటీవ‌ల‌ ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసారంట. లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో అపార్ట్ మెంట్ తీసుకున్న మలైకా, అర్జున్ లు త్వ‌ర‌లోనే ఆ ఇంట్లోకి అడుగుపెట్ట‌నున్నారని సమాచారం. ఇక ఈ జంట ఏప్రిల్ 19,2019న పెళ్ళి చేసుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. క‌రీనా క‌పూర్ , క‌రీష్మా, ర‌ణవీర్ సింగ్‌, దీపికా ప‌దుకొణేతో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖుల్ని వివాహ వేడుక‌కి హాజరుకాబోతున్నారని సమాచారం. వీరి వివాహానికి సంబందించిన అనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే ఇవ్వనున్నారు.

1998లో అర్భాజ్ ఖాన్‌ని ప్రేమ వివాహం చేసుకుంది మలైకా అరోరా. వీరికి 15 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. కొన్ని మనస్పర్ధల వల్ల వీరిద్దరూ 2017 లో విడిపోయారు. కొడుకు బాధ్యతలను మలైకా దక్కించుకోగా, అర్బాజ్ కి తన కొడుకుని కలుసుకోవడానికి కోర్టు అనుమతినిచ్చింది. ఇదిలా ఉండగా అర్బాజ్, మలైకాకి విడిపోవడానికి అసలు కారణం అర్జున్ కపూరే అని అప్ప‌ట్లో వచ్చాయి. ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్…. అశుతోష్ గోవ‌రిక‌ర్ తెరకెక్కిస్తున్న ‘పానిప‌ట్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఏదేమైనా ఇప్పుడు బాలీవుడ్ దృష్టాంతా వీరి వివాహం పైనే ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus