Malaika Arora: ఎలా ఉండాలో, ఏం చేయాలో, నాకు తెలుసు.. మండిపడ్డ నటి!

బాలీవుడ్ ముద్దుగుమ్మ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలు. 48 ఏళ్ల ఈ బ్యూటీ కుర్ర హీరోయిన్లకు ధీటుగా తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. ఆమె వేసుకునే బట్టలు కూడా అలానే ఉంటాయి. ఈ మధ్యకాలంలో మలైకా డ్రెస్సింగ్ విషయంలో బాగా ట్రోలింగ్ కి గురవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్ పై వచ్చిన విమర్శలపై స్పందించింది.

ఒక మహిళను ఆమె వేసుకునే బట్టలు, నెక్ లైన్ ను బట్టి అంచనా వేయడం కరెక్ట్ కాదు.. జనాల అభిప్రాయాలకు అనుగుణంగా నా జీవితాన్ని గడపలేనని చెప్పింది. డ్రెస్సింగ్ అనేది తన వ్యక్తిగత విషయమని తెలిపింది. తనకు సొంతంగా కొన్ని ఆలోచనలు, ఎంపికలు ఉంటాయని.. అందుకే తను ఎవరి డ్రెస్సింగ్ గురించి మాట్లాడానని చెప్పింది. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి..? ఏం వేసుకుంటే సూట్ అవుతుందో..? తనకు బాగా తెలుసని.. కాబట్టి దాని గురించి చెప్పే హక్కు ఎవరికీ లేదని మండిపడింది.

ప్రస్తుతం తన వయసుకి, ధరించే దుస్తుల విషయంలో సౌకర్యంగానే ఉందని చెప్పింది. తనకు నచ్చినట్లుగానే ఉంటానని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా.. 2017లో తన భర్త అర్భాజ్ ఖాన్ తో విడిపోయిన మలైకా.. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. ఈ ఏడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. పెళ్లి సంగతేమో కానీ.. ఈ జంట మాత్రం పార్టీలు, ట్రిప్ లంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus