Mahesh Babu, Trivikram: త్రివిక్రమ్ మహేష్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఈమేనా?

స్టార్ డైరెక్టర్ తివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా మార్చి నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. గతేడాది ఈ సినిమా షూటింగ్ మొదలుకావాల్సి ఉన్నా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమైంది. అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమాకు ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైంది.

అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత పూజా హెగ్డే త్రివిక్రమ్ కాంబినేషన్ లో మహేష్ హీరోగా సినిమా తెరకెక్కనుండగా సంయుక్త మీనన్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఎంపికయ్యారని సమాచారం. మహేష్ మరదలి పాత్రలో సినిమాలో సంయుక్త మీనన్ కనిపించనున్నారని సమాచారం. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ లో సంయుక్త మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సార్ సినిమాలో కూడా సంయుక్త మీనన్ ఎంపికయ్యారు.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో సంయుక్త మీనన్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మలయాళ, తమిళ సినిమాలలో ఇప్పటికే సత్తా చాటిన సంయుక్త మీనన్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సంయుక్త మీనన్ నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఈ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాలలో మరిన్ని ఎక్కువ ఆఫర్లు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. సంయుక్త మీనన్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమాలో సంయుక్త అభినయం నచ్చి మహేష్ సినిమా కొరకు ఆమెను ఎంపిక చేశారని బోగట్టా. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే మ్యూజిక్ కు సంబంధించిన వర్క్ మొదలైంది. త్రివిక్రమ్ సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే థమన్ ఈ సినిమాలో పాటలు ప్రత్యేకంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus