సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది మహిళలు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. గతంలో వీటిని జనాలు కూడా భూతద్దంలో పెట్టి చూసేవారు. కానీ తర్వాత వారు కూడా వీటిని సీరియస్ గా చూడటం మానేశారు. ఎందుకంటే.. అవకాశాలు లేని మహిళలు మాత్రమే పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తూ ఇంటర్వ్యూల్లో వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు అందరికీ ఓ అవగాహన వచ్చేసింది.
సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే..ఓ మలయాళ నటి గతంలో జర్నలిస్ట్‌గా చేసిన రినీ ఆన్ జార్జ్ ఇటీవల ఓ రాజకీయ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువ నాయకుడు నాకు కొన్నేళ్లుగా అసభ్యకరమైన మెసేజ్..లు పంపుతున్నాడు.నన్ను హోటల్ రూమ్ కి రావాలని వేధిస్తున్నాడు.
దీంతో నేను కొంతమంది పార్టీ నాయకులకి ఫిర్యాదు చేశాను. అయినా సరే.. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. అతనికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారు.మీ ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్ళని కాపాడుకోని నాయకులు రాష్ట్రంలో ఉన్న మిగతా మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారు” అంటూ చెప్పుకొచ్చింది రినీ ఆన్ జార్జ్. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.
రినీ కామెంట్స్ లో ఎక్కడా కూడా ఆ రాజకీయ నాయకుడి పేరు ప్రస్తావించింది లేదు. అయినప్పటికీ ఆమె గురించి తెలిసిన మీడియా సంస్థలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్ కూటధిల్ గురించే అని ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ నేతలు కలగజేసుకుని రాహుల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.