‘మీటూ’ ప్రభావంతోనే సినిమాలకు దూరమయ్యాను..!

గత కొంత కాలంగా ‘మీటూ’ ఉద్యమం ఏ రేంజ్లో ఊపందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు దర్శక నిర్మాతలు, హీరోలు, మమ్మల్ని వేధిస్తున్నారంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తమ బాధని వ్యక్తం చేసారు. అయితే ఇటీవల ఆ పరిణామాలు కొన్ని తగ్గాయి.. అని అనుకునే లోపే… తాజాగా మరో తార… మీటూ ముందుకు వచ్చింది. ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియా ముందు బయటపెట్టింది. లైంగిక వేధింపుల కారణంగా నటనకు దూరమయ్యానంటూ… అందరినీ షాక్ కి గురి చేసింది.

ఈమె ఎవరో కాదు.. ప్రముఖ మలయాళ నటి కణి కుసృతి. ‘కాక్ టెయిల్’, ‘షికార్’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతా బానే ఉంది అనుకునే సమయంలో సడెన్ గా నటనకి దూరమైంది ఆ నటి. దీనికి అసలు కారణం ఏంటని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. షాకింగ్ నిజాలు బయటపెట్టింది. తాను నటించబోతున్న ఓ చిత్రానికి సంబందించిన దర్శకనిర్మాతలు తమను శారీరకంగా సుఖపెడితేనే ఆఫర్ ఇస్తామని బెదిరించారట.

తన తల్లి పై కూడా ఒత్తిడి తెచ్చారని సమాచారం. అందుకు ఆ నటి అంగీకరించకపోవడంతో ఆమెకు అవకాశాలు రాలేదని, జీవితం గడిచే పరిస్థితి లేకపోవడం వలన నటనని వదులుకున్నట్లు తెలియజేసింది. సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఊపందుకోవడం ఓ మంచి పరిణామమని.. దీంతో కనీసం కొంత మందికైనా.. న్యాయం జరిగితే… చాలా సంతోషిస్తానని చెప్పి ఆ నటి అందరినీ కంట తడి పెట్టుకుందట కణి కుసృతి. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus