రీమేక్ సినిమాల సంస్కృతి ఈనాటిది కాదు. 1950 ల టైం నుండీ నడుస్తుంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాకు సంబంధించిన రైట్స్ ను కొనుగోలు చేసి వేరే భాషల్లో దానిని తెరకెక్కిస్తూ ఉంటారు. మన టాలీవుడ్లో కూడా డజన్ల కొద్దీ సినిమాలు రీమేక్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో మనవాళ్ళు ఎక్కువగా మలయాళం సినిమాలు రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఈ మధ్యనే ‘భీమ్లా నాయక్’ సినిమా వచ్చింది. పవన్ కళ్యాణ్-రానా నటించిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేకే అన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది మాత్రమే ఇంకో 10 మలయాళం సినిమాలు టాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) లూసీఫర్ :
చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ పేరుతో ఈ చిత్రం రీమేక్ అవుతుంది.
2) డ్రైవింగ్ లైసెన్స్ :
ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను రాంచరణ్ కొనుగోలు చేసాడు. అది చేతులు మారి ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థకి దక్కిందని భోగట్టా. ఏదేమైనా ఈ మూవీ రీమేక్ అవ్వడం పక్కా..!
3) పాదయోత్తం :
అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుమంత్ ఈ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. ‘అనగనగా ఒక రౌడీ’ పేరుతో ఈ చిత్రం రీమేక్ అవుతుంది.
4) ద గ్రేట్ ఇండియన్ కిచెన్ :
ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ లు హీరోహీరోయిన్లుగా ఈ చిత్రం తెలుగులోకి రీమేక్ అవుతుంది.
5) జోసెఫ్ :
‘శేఖర్’ టైటిల్ తో రాజశేఖర్ హీరోగా ఈ చిత్రం తెలుగులోకి రీమేక్ అయ్యింది.
6) తీవండి :
ఈ చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ అవుతుంది. వాటి వివరాలు తెలియాల్సి ఉంది.
7) బ్రో డాడీ :
ఈ మూవీ కూడా తెలుగులోకి రీమేక్ కానుంది. వెంకటేష్, రానా లు హీరోలుగా నటించే అవకాశాలు ఉన్నాయి.
8) నాయట్టు :
అంజలి, రావు రమేష్, ప్రియదర్శి .. ప్రధాన పాత్రల్లో ‘పలాస 1978’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రీమేక్ కావాల్సి ఉంది. షూటింగ్ కూడా ప్రారంభమైంది కానీ ఆగిపోయిందనే టాక్ కూడా నడుస్తుంది.
9) హెలెన్ :
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెలుగులోకి రీమేక్ కానుంది.
10) కప్పెల :
సిద్ధు జొన్నలగడ్డ, ‘ఖైదీ'(2019) ‘మాస్టర్’ చిత్రాల నటుడు అర్జున్ దాస్.. ఈ రీమేక్ లో హీరోలుగా నటిస్తున్నారు.