Mammootty: మలయాళ స్టార్ హీరో మమ్ముట్టికి సొంతమైన ఈ రికార్డ్ గురించి తెలుసా?

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మమ్ముట్టి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల భ్రమయుగం సినిమాతో మమ్ముట్టి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. మమ్ముట్టి సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1985 సంవత్సరంలో మమ్ముట్టి ఏకంగా 39 సినిమాలలో నటించారు.

ఒక హీరో ఏడాదిలో 39 సినిమాలలో నటించడం సులువైన విషయం కాదు. అయితే మమ్ముట్టి మాత్రం అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకున్నారు. భవిష్యత్తులో ఈ రికార్డును బ్రేక్ చేయడం మరో సినిమాకు సాధ్యం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మమ్ముట్టి పలు తెలుగు ప్రాజెక్ట్ లలో సైతం నటించి మెప్పించారు. ఆ సమయంలో మమ్ముట్టి రోజుకు మూడు షిఫ్ట్ లలో పని చేసేవారని తెలుస్తోంది.

రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పని చేయడం వల్లే ఆయన ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. మమ్ముట్టి వయస్సు 72 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా ఫుల్ ఎనర్జీతో మమ్ముట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మమ్ముట్టి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నేటి తరం హీరోలు మమ్ముట్టిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మమ్ముట్టి భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్నారు. భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో మమ్ముట్టి సినిమాలు తెరకెక్కుతుండటంతో ఆయన సినిమాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి ఆదరణ పొందుతున్నాయి. మమ్ముట్టి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. మమ్ముట్టిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus