తెలుగు తెరంగేట్రం చేసిన మరో మల్లూ బేబి!
- March 29, 2016 / 01:41 PM ISTByFilmy Focus
ఇంతకుమునుపు తెలుగు సినిమాలో ఎక్కువగా బాంబే హీరోయిన్లు కనపడేవారు. ఇప్పుడు ముంబై హీరోల స్థానంలో మలయాళ ముద్దుగుమ్మలు చేరారు. నిత్యామీనన్ తో మొదలైన ఈ మలయాళ భామల దండయాత్ర అప్పటినుంచి కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఈ జాబితాలో మరో మలయాళీ ముద్దుగుమ్మ మియా జార్జ్ కూడా చేరింది. మలయాళంలో ఇప్పటికే 25 సినిమాల్లో నటించి ఉన్న ఈ భామ సునీల్ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో కథానాయకిగా తెలుగు తెరకి పరిచయం కాబోతోంది.
నిత్యామీనన్, మాళవిక నాయర్ ల వాలే మియా జార్జ్ కూడా తెలుగులో ఒక వెలుగు వెలుగుతుందేమో చూడాలి!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















