Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?
- June 5, 2026 / 04:16 PM ISTByFilmy Focus Desk
చేతిలో ఓ సినిమా ఉంది. షూటింగ్ పూర్తయినా.. వివిధ కారణాల వల్ల ఆ సినిమా విడుదల కావడం లేదు. అసలు ఎప్పుడు విడుదల అవుతుంది అనేది కూడా తెలియడం లేదు. రేపు, మాపు అంటున్నారు తప్ప విడుదల వైబ్స్ అస్సలు రావడం లేదు. ఆ డైరక్టర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అనుకుంటే.. ఇప్పుడు నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అనే సమాచారం బయటకు వచ్చింది. అ దర్శకుడే మల్లిడి వశిష్ట. ఆయన చేతిలో ఉన్న సినిమా చిరంజీవి ‘విశ్వంభర’.
Malladi Vasista
ఇప్పుడు ఆయన కొత్త కథ సిద్ధం చేసుకొని చెప్పిన స్టార్ హీరో వెంకటేశ్. ప్రస్తుతం వెంకటేశ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం 47’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కల్యాణ్ రామ్‌తో చేయనున్న మల్టీస్టారర్ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాతి కథను ఓకే చేసే పనిలో పడ్డాడట వెంకటేశ్. ఈ క్రమంలోనే సురేశ్‌బాబుకు వశిష్ట కథ లైన్ చెప్పారట.

సురేశ్ బాబుకు లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి వెంకటేశ్‌కి చెప్పమని సూచించారట. దీంతో ఇప్పుడు వశిష్ట అదే పనిలో ఉన్నారట. ఆ స్టోరీ సిట్టింగ్ అయ్యాక సినిమాపై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది. ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో సమస్యల వల్ల ఆలస్యమవుతూ వస్తోందని వార్తలొస్తున్నాయి. టీజర్ రిలీజ్ వరకు ఉన్న సినిమా మీద ఉన్న హైప్ ఒక్కసారిగా ఆగిపోయింది.
దాంతో సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరోసారి టీమ్ కూర్చుంది. చాలా నెలలుగా ఈ విషయంలో పనులు జరుగుతున్నా ఎక్కడో హీరో చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేయడం లేదు అనే వార్తలొస్తున్నాయి. దీనికి ఇప్పుడు వశిష్ట కొత్త సినిమా ఓకే చేసుకోవడానికి ఏమన్నా రిలేషన్ ఉందేమో తెలియాల్సి ఉంది.











