Ravi Teja: అప్పుడు మిస్ అయ్యింది.. ఇప్పుడు సెట్ అయ్యింది.. ‘విశ్వంభర’ దర్శకుడితో రవితేజ సినిమా..!

రవితేజ ఇప్పుడు వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఫ్యాన్స్ కూడా రవితేజని వెనకేసుకురాలేక ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హిట్టు సినిమాలను రవితేజ రిజెక్ట్ చేస్తూ.. ప్లాప్ కథలకు ఓకే చెబుతూ వస్తున్నాడు రవితేజ. కేవలం పారితోషికాలకి టెంప్ట్ అయ్యి సినిమాలు చేస్తున్నాడు అనే విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నాడు. వాస్తవానికి ‘సార్’ కథ రవితేజకే ఫస్ట్ చెప్పాడట దర్శకుడు వెంకీ అట్లూరి. కానీ రవితేజ రిజెక్ట్ చేయడంతో అది ధనుష్ వద్దకు వెళ్ళింది.

Ravi Teja

స్వయంగా దర్శకుడు వెంకీ అట్లూరి ‘మాస్ జాతర’ ప్రమోషన్స్ లో ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే ‘బింబిసార’ వంటి సూపర్ హిట్ సినిమాని రవితేజ రిజెక్ట్ చేసినట్టు కూడా అప్పట్లో టాక్ నడిచింది. ఆ కథ ఏమో కానీ దర్శకుడు మల్లిడి వశిష్ట్ తో సినిమా ఓకే చేసి తర్వాత తప్పుకున్నాడు రవితేజ. ఈ విషయాన్ని దర్శకుడు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అయినా అతను డిజప్పాయింట్ కాకుండా ‘బింబిసార’ ని కళ్యాణ్ రామ్ తో చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. తర్వాత చిరంజీవితో ‘విశ్వంభర’ చేసే ఛాన్స్ అందుకున్నాడు. మొత్తానికి వశిష్టతో అప్పుడు మిస్ అయిన రవితేజ ఇప్పుడు ఓకే చెప్పినట్టు తాజా సమాచారం.

అవును ‘విశ్వంభర’ ప్రాజెక్టు ఫినిష్ అయిన తర్వాత రవితేజతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు మల్లిడి వశిష్ట్. రవితేజ కూడా వశిష్ట్ తో చేయి కలిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇది కూడా సోసియో ఫాంటసీ మూవీ అని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టుని ఎవరు నిర్మించబోతున్నారు? అనేది తెలియాల్సి ఉంది.

‘ఆడవాళ్లు తాళి వేసుకోవడం వివక్ష’.. ‘అబ్బాయిలకి కూడా పీరియడ్స్ వస్తే బాగుణ్ణు’.. ఏం చెత్త స్టేట్మెంట్లు ఇవి!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus