మీరు ఇప్పుడు చేస్తే తప్పు కాదు… నేను అప్పుడు చేస్తే తప్పా? ఈ ప్రశ్న బాలీవుడ్ ఎవరైనా ఎక్కువగా వేశారు అంటే అది మల్లికా శెరావత్ అనే చెప్పాలి. ఆమె నోటి వెంట ఇలాంటి ప్రశ్నలు మీరు గతంలో విని ఉంటారు. దానికి ఏదో సమాధానం అనుకొని ఉంటారు కూడా. ఇప్పుడు మళ్లీ ఇంకో సమాధానం అనుకోవాల్సి వచ్చింది. ఈసారి ఆమె ‘మీరు’ అన్న వ్యక్తి దీపిక పడుకొనె. ఈ మీరు – నేను కాన్సెప్ట్ ఇప్పుడెందుకు చర్చకు వచ్చింది అంటే.. స్కిన్ షో గురించి అని చెప్పేయొచ్చు.
బాలీవుడ్ సెక్స్ బాంబ్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే నాయిక మల్లికా శెరావత్. ఆమెకు ఆ పేరు రావడానికి కారణం ‘మర్డర్’ సినిమా. ఆ సినిమాలో మల్లికా ఇచ్చిన అందాల విందు అంతలా ఉంటుంది మరి. అప్పటివరకు స్కిన్ షో ఓ రేంజిలో ఉంటే.. దానిని మరింత పెంచేసింది మల్లికనే అని చెప్పాలి. ఈ క్రమంలో ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొంది. 15 ఏళ్లు అయినా ఇంకా ఆమె ఆ రోజుల్ని మరచిపోలేదు అంటే.. అప్పుడు ఆమెను ఎన్నేసి మాటలు అన్నారో అర్థం చేసుకోవచ్చు.
‘మర్డర్’ సినిమా తర్వాత పరిశ్రమకు చెందిన కొంతమంది ఆమెను మానసిక వేధింపులకు గురి చేశారు. ఆ సమయంలో నా శరీరం గురించే అందరరూ మాట్లాడేవారు. ‘మర్డర్’లో నటించడంతో నా గురించి తప్పుగా మాట్లాడుకున్నారు. ముద్దు సన్నివేశాలు, బికినీలో కనిపించడంపై ఎన్నో మాటలు అన్నారు. సినిమా విడుదలైనప్పుడు పరిశ్రమకు చెందిన కొంతమంది, మీడియా వాళ్లు నన్ను మానసికంగా వేధించారు. నా టాలెంట్ గురించి కాకుండా నా శరీరం గురించే మాట్లాడారు అంటూ నాటి రోజుల గురించి చెప్పింది మల్లిక.
అలాంటి వాళ్లు ఇప్పుడు ‘గెహ్రాహియా’లో దీపిక చేసింది చూసి కూడా మాట్లాడటం లేదు. దీపిక చేసిందే అప్పుడు నేనూ చేశాను. కాకపోతే అప్పుడు ప్రేక్షకులు సంకుచిత మనస్తత్వంతో ఉండేవారు. ఇప్పుడు ఆలోచనల్లో మార్పులు వచ్చాయి అని మళ్లీ తనను తానే సర్ది చెప్పుకుంది మల్లిక. ఇక ఆమె కెరీర్ గురించి చూస్తే… మూడేళ్ల తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఆర్‌కే’ జులై 22న విడుదలవుతోంది.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!