మాళవికా నాయర్ అందరికీ సుపరిచితమే. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ అప్పటి నుండి ఒక్క తెలుగులోనే సినిమాలు చేస్తూ వస్తుంది. ‘కళ్యాణ వైభోగమే’ ‘మహానటి’ ‘విజేత’ ‘టాక్సీ వాలా’ ‘నిను వీడని నీడను నేనే’ ‘ఒరేయ్ బుజ్జిగా’ ‘థాంక్యూ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఈమె లేటెస్ట్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఇదిలా ఉండగా..
మాళవికా మొదటి నుండి గ్లామర్ షోకి దూరంగా ఉండేది. అయితే ఈ మధ్య రూటు మార్చింది. విచ్చలవిడిగా అందాలు వడ్డించడానికి ఓకే చెబుతుంది. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా టీజర్, ట్రైలర్ లు కనుక చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే విషయం పై హీరోయిన్ మాళవికా నాయర్ ను ప్రశ్నించగా.. అందుకు ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
మాళవికా నాయర్ మాట్లాడుతూ.. ” అలాంటి సన్నివేశాలు చేయడం నాకు ఇబ్బందిగా అయితే అనిపించలేదు. ఎందుకంటే అవి కావాలని పెట్టిన సన్నివేశాలు అయితే కాదు. కథలో భాగమైన, కథకి అవసరమైన సన్నివేశాలు అవి” అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘నటిగా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి పాత్రలే చేయాలి అనుకోవట్లేదు. కథ, పాత్ర నచ్చితే అన్ని జోనర్లలో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ మాళవిక చెప్పుకొచ్చింది.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్