మా తాత లాయర్‌… నేనూ మంచి లాయర్‌ అవుతా

చదువుతూ మోడలింగ్‌ చేసినవాళ్లను చూసుంటారు, చదువుతూ ఉద్యోగం చేసినవాళ్లనూ చూసుంటారు. కానీ చదువుతూ అందులోనూ ఎల్‌ఎల్‌బీ చేస్తూ నటించిన వాళ్లను చూశారా. ‘నేల టిక్కెట్టు’ సినిమా చూసుంటే ఆ అమ్మాయిని చూసే ఉంటారు. ఎందుకంటే అందులో నటించిన కథానాయిక మాళవిక శర్మ గురించే మనం ఇదంతా చెబుతోంది. కథా నాయికగా నటిస్తూనే ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిందామె. త్వరలో పూర్తిస్థాయి లాయర్‌ కూడా అవుతానంటోంది. మాళవిక ఇటీవలే ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది.

ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఎమ్‌ పూర్తి చేసే పనిలో ఉంది. అంతే కాదు లాయర్‌గా బార్‌ కౌన్సిల్‌లో పేరు కూడా నమోదు చేసుకుంది. అంతేకాదండోయ్‌ కచ్చితంగా క్రిమినల్‌ లాయర్‌ అవుతా అని కూడా చెబుతోంది. దీని వెనుక కారణం కూడా ఉందండోయ్‌. మాళవిక తాత ఓ లాయర్‌. అందుకే ఆమె కూడా ఆ రంగంవైపు ఆకర్షితురాలైందట. అయితే ఆమె లాయర్‌ చదువు అంత ఈజీగా ఏం సాగలేదంట. ‘నువ్వు లాయరు చదవాలనుకుంటే నీ డబ్బుతోనే చదువుకో’ అని వాళ్ల నాన్న అన్నారట.

తండ్రి మాట విని, కోపానికి పోకుండా పట్టుదలతో చదువుకుంది మాళవిక. దీని కోసం ఆమె కాల్‌ సెంటర్లలో కూడా పని చేసిందట. ఆ తర్వాత కొన్ని యాడ్స్‌లో నటించిందట. అలా అలా సినిమాల్లోకి వచ్చేసింది. సినిమాల్లో నటిస్తూనే, చదువుకోవడం ఓ విశేషమైతే… గోల్‌ని మరచిపోకుండా సినిమాల్లో నటిస్తుండటం ఇంకో పెద్ద విషయం. అందుకే రెండు రంగాల్లోనూ మాళవిక విజయం సాధించాలని కోరుకుందాం. అన్నట్లు ఆమె కథానాయికగా నటించిన ‘రెడ్‌’ సంక్రాంతికి వస్తోంది. అది కూడా విజయం సాధించాలని కోరుకుందాం.

1

2

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus