Jailer: ‘జైలర్‌’ విలన్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన వసంత్‌ రవి.. ఏమన్నారంటే?

‘జైలర్‌’ సినిమా విజయం గురించి, వసూళ్ల గురించి మాట్లాడుకుంటున్న రోజులివి. సినిమా విజయం సాధిస్తుంది అనే విషయంలో డౌట్‌ లేకపోయినా.. ఇంత భారీ స్థాయి విజయం దక్కుతుంది అని మాత్రం అందరూ ఊహించి ఉండరు. ఈ సినిమాలో రజనీకాంత్‌ హీరో అయితే… అనిరుథ్‌ మరో హీరో అంటున్నారు. వీళ్లు కాకుండా మరో ముగ్గురు హీరోలు ఈ సినిమా ఉండాల్సింది. కానీ రజనీకాంత్‌ వల్ల ఇద్దరు హీరోలు మాత్రమే ఉన్నారు. ఈ విషయాన్ని వసంత్‌ రవి చెప్పారు.

‘జైలర్‌’ సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు ఆ సినిమా గురించి పెద్దగా అంచనాలు లేవు. వరుస పరాజయాల తర్వాత వస్తున్న రజనీకాంత్‌ సినిమా కావడం వల్ల సినిమా మీద కాస్త నమ్మకం తక్కువుంది. అలాగే పోస్టర్‌లో సేమ్‌ లుక్‌, ఫీల్‌ కనిపించడంతో కష్టమే అనుకున్నవాళ్లు కూడా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో నెల్సన్‌ తీసిన ‘బీస్ట్‌’ పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. కానీ రజనీకాంత్‌ నమ్మకంతో సినిమా ముందుకెళ్లింది. ఈ క్రమంలో మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌ లాంటి వాళ్లు సినిమాలో భాగమయ్యారు.

అయితే వారితోపాటు మమ్మట్టి కూడా సినిమాలో ఉండాల్సిందట. ఈ సినిమాలో విలన్‌ వినాయకన్‌ పాత్రకు బాస్‌ లాంటి ఓ పాత్రను అనుకున్నారట దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌. దాని కోసం మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టిని తీసుకుందాం అని అనుకున్నారట. ఈ విషయాన్ని సినిమాల్లో రజనీకాంత్‌కు కొడుకుగా నటించిన వసంత్‌ రవి చెప్పారు. ‘జైలర్’లో మమ్ముట్టిని విలన్‌గా అనుకున్నారని రజనీకాంతే తనకు చెప్పారని వసంత్‌ రవి తెలిపాడు.

‘జైలర్’ ఆడియో లాంచ్ కార్యక్రమంలో కూడా ‘ఈ సినిమాలో విలన్ రోల్ చేయడం కోసం ఒక పెద్ద యాక్టర్‌ను అనుకున్నాం’ అని రజనీకాంత్‌ చెప్పారు. దానిబట్టి చూస్తే వసంత్‌ రవి చెప్పిన మమ్ముట్టి, రజనీ చెప్పిన నటుడు ఒకరే అని అర్థమవుతోంది. అయితే ఆ పాత్ర వర్కవుట్ అవ్వదు అనిపించి రజనీనే మళ్లీ మమ్ముట్టికి ఫోన్ చేసి వద్దని చెప్పారట. దీంతో ఈ సినిమాలో మమ్ముట్టి మిస్‌ అయ్యారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus