Mammootty, Jyothika: జ్యోతిక – మమ్ముట్టి సినిమాను ఆ దేశాలు బ్యాన్ చేయడానికి కారణం అదేనా..!

ఆసక్తికరమైన కథాంశంతో మమ్ముట్టి–జ్యోతిక జంటగా నటించిన తాజా చిత్రంపై రెండు దేశాలు నిషేధం విధించాయి. మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. నిషేధానికి గురైన ఈ చిత్రం పేరు ‘కాథల్‌–ది కోర్‌’. జీయో బేబి దర్శకత్వంలో దీనిని రూపొందించారు. నవంబర్‌ 23న ఈ సినిమా విడుదల కానుంది. అయితే.. విడుదలకు ముందే ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయడం గమనార్హం. ఇంతకీ ఏంటా సినిమా.. ఏమా కథ.. అందులో అంత అభ్యంతరకర అంశాలు ఏమున్నాయనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందనేదే నిషేధానికి ప్రధాన కారణం. ఈ చిత్రాన్ని కువైట్, ఖతార్‌ దేశాలు ప్రస్తుతం బ్యాన్‌ చేశాయి. త్వరలోనే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ కేరళలోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఓ పత్రిక దీని కథా నేపథ్యాన్ని బయట పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన జార్జ్‌ (మమ్ముట్టి) తన భార్య ఓమన (జ్యోతిక)తో కలిసి నివసిస్తుంటాడు.

అయితే ఈ సినిమాలో జార్జ్ పంచాయతీ ఎన్నికలకు పోటీ చేయాలని నిర్ణయించుకుని నామినేషన్‌ వేస్తాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఓమన అతడి నుంచి విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. అదే గ్రామంలో డ్రైవింగ్‌ స్కూల్‌ నడుపుతున్న ఓ స్నేహితుడితో జార్జ్‌ గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. జార్జ్‌ లైంగిక ధోరణిని తాను నేరంగా చూడడం లేదని.. కేవలం విడాకులు మాత్రమే కోరుతున్నట్లు చెబుతుంది. దీంతో అతడి పోటీపై సందిగ్ధత నెలకొంటుంది. ఈ సినిమా రిలీజ్ కు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది చూడాలి మరి ఏమి జరుగుతోందో.

అయితే, జార్జ్‌ మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది చిత్రంలో చూడాల్సి ఉంటుంది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ఇందులో చూపించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. అయితే ఈ కథ గురించి సమాచారం బయటికి రాగానే కువైట్, ఖతార్‌ దేశాలు ఈ సినిమాను తమ దేశంలో ప్రదర్శించడానికి వీల్లేదని పేర్కొన్నాయి. ఇక ’కాథల్‌–ది కోర్‌’ చిత్రం కోసం మమ్ముట్టి– జ్యోతిక (Jyothika) మొదటిసారి కలిసి నటించారు. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus