Mammootty: తప్పు తెలుసుకున్నానంటూ పోస్ట్.. ఏం జరిగిందంటే..!

ఒకప్పుడు సెలబ్రిటీలను చూడాలనేది ‘ఫ్యాన్’ సినిమాలో షారుఖ్ ఖాన్‌లాగా ఎంతోమందికి డ్రీమ్.. ఒక్కసారైనా కలవాలి.. కలిసి మాట్లాడాలి.. ఫోటో దిగాలి అని పిచ్చెక్కిపోయేవారు.. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఎంచక్కా తమ ఫేవరెట్ స్టార్స్ దగ్గరినుండి ఏ సెలబ్రిటీ పోస్టుకైనా కామెంట్స్ పెట్టెయ్యొచ్చు.. వాళ్లతో లైవ్ చాట్‌లో పార్టిసిపెట్ చెయ్యొచ్చు.. ఒక్కోసారి చిరాకుగా అనిపించినా కానీ సహనంతో సమాధానాలిస్తుంటారు సెలబ్స్.. రీసెంట్‌గా నటి కస్తూరి విషయంలో ఏం జరిగిందనేది చూశాం..

ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ మాటలనే తప్పుబట్టారు నెటిజన్లు.. మీరు అన్నది బాగున్నది.. నేననేది బహుబాగున్నదని మీతో అనిపించమంటారా అన్నట్టు ఆయనకు సలహా ఇచ్చారు.. దీంతో స్వయంగా మెగాస్టార్ తన తప్పు ఒప్పుకుని సారీ.. తనది తప్పని తెలియజెప్పినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు.. ఆ మెగాస్టార్ ఎవరో కాదు.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి..వివరాల్లోకి వెళ్తే.. మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘2018’ టీజర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు.. ఈ ఈవెంట్‌లో మమ్ముట్టి మాట్లాడుతూ..

‘ఈ సినిమా డైరెక్టర్ జూడ్ ఆంటోని తల మీద వెంట్రుకలు లేకపోయినా.. ఎక్స్‌ట్రార్డినరీ మైండ్ కలిగిన టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్’ అని ప్రశంసించారు..కట్ చేస్తే.. ఈ మాటే మమ్ముట్టిని వివాదంలోకి లాగింది.. డైరెక్టర్‌ని పొగడాలంటే.. బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏముంది?.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కాస్తా మమ్ముట్టి దృష్టికి వెళ్లడంతో.. ఫేస్‌బుక్ ద్వారా ఆయన స్పందించారు. ‘2018’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ జూడ్ ఆంటోని మీద ప్రశంసలు కురిపించాలనే ఉత్సాహంలో నేను వాడిన పదాలు కొందరిని ఇబ్బంది పెట్టాయి..

అందుకు నా క్షమాపణలు చెప్తున్నాను.. అలాగే ఇక మీదట ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానని మాటిస్తున్నాను.. నా తప్పుని తెలియజేసినందుకు అందరికీ థ్యాంక్స్’’ అని పోస్ట్ చేశారు. మమ్ముట్టి అంతటి స్టార్ హుందాగా స్పందించడంతో.. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసు కాబట్టే.. ఆయన ఈస్థాయిలో ఉన్నారు’ అంటూ.. క్వశ్చన్ చేసిన వారే మమ్ముక్కా (మలయాళంలో అభిమానులు ముద్దుగా పిలుస్తారు) ని పొగుడుతున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus