మలయాళంలో మెగాస్టార్ గా పేరొందిన మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ఇంట విషాదం చోటు చేసుకుంది. అతని సోదరి అమీనా కన్నుమూయడం జరిగింది. ఆమె వయసు 70 ఏళ్ళు. కొన్నాళ్లుగా అమీనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు.ఈ క్రమంలో ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పెట్టి చికిత్స అందించినప్పటికీ లాభం లేకపోయింది. ఆమె పరిస్థితి విషమించడంతో చివరి శ్వాస విడిచారు. అమీనాకి భర్త, ఇద్దరు పిల్లలు ఉండడంతో వాళ్ళు తీవ్ర విషాదానికి లోనయ్యారు.
ఇదిలా ఉండగా.. 4 నెలల క్రితం అంటే.. ఏప్రిల్ నెలలో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ కూడా మరణించారు. ఆమె వయసు 93 ఏళ్ళు కావడంతో వయోభారం, అనారోగ్య సమస్యలతో ఆమె మరణించారు. ఇలా 4 నెలల వ్యవధిలోనే మమ్ముట్టి ఇంట్లో రెండు విషాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇక ఫాతిమా ఇస్మాయిల్ కి మమ్ముట్టి, ఇబ్రహీం కుట్టి, జకారియా కుమారులతో పాటు అమీనా, సౌదా, షఫినా అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు అనే సంగతి తెలిసిందే.
ఇక మమ్ముట్టి ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు. ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ సైతం.. ఇప్పుడు టాప్ హీరోగా ఎదిగారు. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ.. బిజీగా గడుపుతున్నారు. తెలుగులో కూడా అతను బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే ‘కింగ్ ఆఫ్ కోత’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దుల్కర్ సల్మాన్.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!