Mammootty: మన సీనియర్‌ స్టార్లు కూడా ఈ పని చేస్తేనా.. నా సామిరంగా!

స్టార్‌ హీరోలు సీనియర్‌ స్టార్‌ హీరోలు అయ్యాక వాళ్ల మీద బాధ్యత భారీగా పెరుగుతుంది అంటారు. వయసుకు తగ్గ పాత్రనా కాదా, సగటు మాస్‌ పాత్రలో తనను ప్రేక్షకులు అంగీకరిస్తారా లేదా అనే చర్చ మైండ్‌లో రన్‌ అవుతూనే ఉంటుంది. ఈ సమయంలో కీలక డెసిషన్‌ తీసుకున్నవాళ్లకు మంచి విజయాలు వస్తాయి. మూస పద్ధతితో అదే మాస్‌ సినిమా చేస్తే హిట్‌ అవుతుందేమో కానీ… అభిమానులు, ప్రేక్షకుల మనసు గెలుచుకోలేరు. ఇప్పుడు మన స్టార్‌ హీరోలు ఈ ప్రయోగాలకు ముందుకొస్తున్నారు.

తాజాగా మలయాళ మెగాస్టార్‌ (Mammootty) మమ్ముక్క… అలియాస్‌ మమ్ముట్టి ఇలాంటి ప్రయత్నమే చేశారు. గురువారం తన 72వ జన్మదినం సందర్భంగా ఆయన కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చింది. రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘భ్రమయుగం’ సినిమా పోస్టర్‌ బయటకు వచ్చింది. ఇందులో మమ్ముక్క కొత్త అవతారంలో గంభీరమైన చిరునవ్వుతో భయానకంగా కనిపించాడు. ఈ సినిమాలో మమ్ముట్టి మాంత్రికుడిగా కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఆ పోస్టర్‌ చూస్తే చిన్నగా ఒళ్లు గగుర్పొడవడం సహజం అని చెప్పొచ్చు.

ఎందకంటే మన హీరోలు కూడా ఇలాంటి పాత్రకు ముందుకు రారు. ప్రయోగాలు ఎక్కువగా చేసే తమిళ హీరోలు కొందరు గతంలో ఇలా కనిపించాడు. ఇప్పుడు ఈ వయసులో మమ్ముట్టి ఆ పాత్ర చేస్తున్నారు అంటే.. అతని ధైర్యానికి హ్యాట్సాఫ్‌ అని అంటున్నారు నెటిజన్లు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ‘భ్రమయుగం’ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా లెవల్‌లో ఐదు భాషలలో వచ్చే ఏడాది సినిమాను విడుదల చేస్తారట

ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. మనం ఇంకెన్నాళ్లు ఇలాంటి పాత్రల కోసం పక్క వుడ్స్‌వైపు చూడాలి. మన సీనియర్‌ స్టార్‌ హీరోలు, స్టార్‌ హీరోలు కూడా ఈ విషయంలో ఒకడుగు ముందుకు వేయాలి అనే డిస్కషన్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. గతంలో ఒకరిద్దరు చేసినా ఇలా స్టార్లు చేస్తే ఆ కిక్‌, మోటివేషన్‌ వేరేగా ఉంటుంది. చూద్దాం మన వాళ్లు ఎవరు ఇలా ప్రయోగానికి వచ్చి నా సామిరంగా అనిపిస్తారో.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus