‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మనం’. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య,అక్కినేని నాగేశ్వర రావు,శ్రీయ,సమంత.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ఇది. అక్కినేని నాగేశ్వర రావు గారికి ఇది ఆఖరి చిత్రం. అలాగే అమల, అఖిల్ లు కీలక పాత్రలు పోషించిన మూవీ కూడా. ఎటువంటి అంచనాలు లేకుండా 2014 వ సంవత్సరం మే 23న విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది.
అలాగే ఈ మూవీ ఓ క్లాసిక్ అని చెప్పొచ్చు. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యింది. నేటితో ఈ మూవీ విడుదలై 8 ఏళ్ళు పూర్తికావస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ మూవీ పై ఎక్కువ ట్వీట్లు పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ‘మనం’ బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 11.20 cr |
సీడెడ్ | 03.90 cr |
ఉత్తరాంధ్ర | 03.30 cr |
ఈస్ట్ | 02.10 cr |
వెస్ట్ | 01.50 cr |
గుంటూరు | 02.25 cr |
కృష్ణా | 02.00 cr |
నెల్లూరు | 01.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 27.25 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 03.00 cr |
ఓవర్సీస్ | 06.40 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 36.65 cr |
‘మనం’ చిత్రానికి రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.36.65 కోట్ల షేర్ ను రాబట్టి.. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బయ్యర్లకి ఈ మూవీ రూ.18.65 కోట్ల భారీ లాభాలను అందించింది. ఈ మూవీతో వరుస ప్లాపులతో సతమతమవుతున్న కింగ్ నాగార్జున బ్లాక్ బస్టర్ కొట్టి ఊపిరి పీల్చుకున్నాడు.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!